×
Ad

Pawan Kalyan Three Options : 3 ఆప్షన్లతో ముందుకొచ్చిన పవన్.. పొత్తులు, సీఎం అభ్యర్థిపై జనసేనాని హాట్ కామెంట్స్

రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలాసార్లు తగ్గా. గత అన్ని సార్లు తగ్గాల్సిన వరకు తగ్గా. 2014లో తగ్గాం. 2019లోనూ తగ్గాం. 2024లో మాత్రం మేము తగ్గడానికి సిద్ధంగా లేము.

  • Published On : June 4, 2022 / 08:43 PM IST

Pawan Kalyan Three Options (1)

Pawan Kalyan Three Options : పొత్తులు, సీఎం అభ్యర్థి, ప్రభుత్వ ఏర్పాటుపై జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 2014లో, 2019లో తగ్గామన్న పవన్.. 2024లో మాత్రం తగ్గేదే లేదని స్పష్టం చేశారు. మనం తగ్గింది చాలు, ఇక తగ్గాల్సింది వాళ్లే అని తేల్చి చెప్పారు పవన్. టీడీపీ నేతలు కూడా బైబిల్ సూక్తిని పాటించాలని, తనకు తాను తగ్గించుకోవాలని పవన్ సూచించారు. ఈసారి తాము తగ్గేదేలేదన్నారు పవన్ కల్యాణ్. ఈసారి ప్రజలు గెలవాలని కోరుకుంటున్నానని చెప్పారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అని అన్నారు పవన్.

Pawan On Caste Politics : మనం తగ్గింది చాలు, ఇక వాళ్లే తగ్గాలి.. కులాల ఐక్యత ఉండాలి-పవన్ కల్యాణ్

”రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలాసార్లు తగ్గా. గత అన్ని సార్లు తగ్గాల్సిన వరకు తగ్గా. 2014లో తగ్గాం. 2019లోనూ తగ్గాం. 2024లో మేము తగ్గడానికి సిద్ధంగా లేము” అని పవన్ తేల్చి చెప్పారు. అన్నిసార్లు తగ్గాం.. ఈసారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందని నా కోరిక అని పవన్ అన్నారు.

ఇక సీఎం అభ్యర్థి పైనా పవన్ స్పందించారు. నేనే సీఎం అభ్యర్థిని అని నాకు స్వయంగా బీజేపీ జాతీయ నాయకులు ఎవరూ చెప్పలేదు. మీడియాలో వచ్చిన దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడను. నువ్వే సీఎం అభ్యర్థివి అని.. బీజేపీ అగ్రనాయకత్వం చెబితే అప్పుడు నేను మీకు తెలియజేస్తా.

Janasena Nagababu : పవన్.. నిప్పుల్లో దూకమంటే దూకాలి, 2024లో సీఎంగా చూసుకోవచ్చు-నాగబాబు

ఇక ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలపై పవన్ మూడు ఆప్షన్లతో ముందుకొచ్చారు. ”పదవి అనేది ఇంకొంచెం ఎక్కువ చేయడానికి. పదవి లేకపోతే మనం ఆగిపోము. పదవి వస్తే ఇంకా బాగా చేస్తాం. పదవి ఉన్నప్పుడు ఎక్కువ హక్కు, అధికారం ఉంటుంది. మన ముందే మూడే సాధ్యాలు ఉన్నాయి. బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపన చేయడం. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. లేదా జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని స్థాపించడం. ఈ మూడు ఆప్షన్లే ఉన్నాయి. నేను అన్నింటికీ సిద్ధం” అంటూ పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు.