‘జనసేన’ ఐదో జాబితా విడుదల : ఐదు ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

హైదరాబాద్ : జనసేన పార్టీ ఐదో జాబితాను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఐదు ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

  • Publish Date - March 21, 2019 / 03:14 AM IST

హైదరాబాద్ : జనసేన పార్టీ ఐదో జాబితాను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఐదు ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

హైదరాబాద్ : జనసేన పార్టీ ఐదో జాబితాను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఐదు ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నంద్యాల నుంచి ఎస్.పి.వై రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలంగాణలోని మహబూబాబాద్ నుంచి భూక్యా భాస్కర్ నాయక్ బరిలో ఉన్నారు. విజయనగరం నుంచి శ్రీనివాస రావు, కాకినాడ నుంచి జ్యోతుల వెంకటేశ్వరరావు, గుంటూరు నుంచి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఏపీలో 16 మంది శాసన సభ అభ్యర్థులను జనసేన ప్రకటించింది. 

పొత్తులో భాగంగా జనసేనకు 18 పార్లమెంట్, 140 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఐదు జాబితాలను విడుదల చేశారు. ఇప్పటివరకు 11 పార్లమెంట్, 102 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 38 అసెంబ్లీ, ఏడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించాల్సివుంది. మిగిలిన అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తున్నారు. ఇవాళ పవన్ గాజువాకలో నామినేషన్ వేస్తున్నారు. రేపు భీమవరంలో నామినేషన్ వేయనున్నారు. మిగిలిన జాతితాను ఇవాళా సాయంత్రం లేదా రేపు విడుదల చేసే అవకాశం ఉంది. 

లోక్ సభ అభ్యర్థులు
విజయనగరం.. ముక్కా శ్రీనివాస రావు
కాకినాడ…జ్యోతుల వెంకటేశ్వరరావు
గుంటూరు… బి.శ్రీనివాస్ 
నంద్యాల.. ఎస్.పి.వై రెడ్డి 
మహబూబాబాద్.. భూక్యా భాస్కర్ నాయక్ 

శాసన సభ అభ్యర్థులు
సాలూరు.. బోనెల గోవిందమ్మ
పార్వతీపురం…గొంగడ గౌరీ శంకరరావు
చీపురుపల్లి… మైలపల్లి శ్రీనివాసరావు
విజయనగరం…డా.పెదమజ్జి హరిబాబు
బొబ్బిలి…గిరదా అప్పలస్వామి
పిఠాపురం…మాకినీడు శేషుకుమారి
కొత్తపేట..బండారు శ్రీనివాసరావు
రామచంద్రపురం…పోలిశెట్టి చంద్రశేఖర్ 
జగ్గంపేట… పాటంశెట్టి సూర్యచంద్రరావు
నూజివీడు…బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
మైలవరం…అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)
సత్తెనపల్లి… వై.వెంకటేశ్వరరెడ్డి
పెదకూరపాడు…పుట్టి సామ్రాజ్యం
తిరుపతి…చదలవాడ కృష్ణమూర్తి
శ్రీకాళహస్తి… వినుత నగరం
గుంతకల్లు….మధుసూదన్ గుప్తా