Anantapur : రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు… తన కారులో ఆస్పత్రికి తరలించిన జేసీ దివాకర్ రెడ్డి

అంతేకాకుండా తన మనిషిని ప్రభుత్వ ఆసుపత్రికి పిలిపించి ఆ మహిళ దగ్గర ఉండి చూసుకోమని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. మహిళ ప్రాణాలు కాపాండేందుకు జేసీ చేసిన ప్రయత్నం విఫలమైంది.

  • Published On : March 31, 2022 / 11:31 AM IST

Road Acident (1)

JC Divakar Reddy : అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రం సమీపంలో అదుపు తప్పి ఆటో బొల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. తాడిపత్రి నుంచి వస్తున్న మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ఈ ఘటనను చూశారు. ‘నీకు ఏమికాదమ్మ’ అని గాయపడ్డ మహిళకు జేసి దివాకర్ రెడ్డి ధైర్యం చెప్పారు. తన వాహనంలో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అంతేకాకుండా తన మనిషిని ప్రభుత్వ ఆసుపత్రికి పిలిపించి మహిళ దగ్గర ఉండి చూసుకోమని జేసి దివాకర్ రెడ్డి చెప్పారు. మహిళ ప్రాణాలు కాపాండేందుకు జేసి దివాకర్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది.

Road Accident : అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

గాయపడ్డ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతురాలిది బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామంగా పోలీసులు గుర్తించారు. మానవత్వం చూపిన జేసి దివాకర్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ అయింది.