ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి.. రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి.. రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రెడ్లకు మేలు చేశారని తుళ్లూరులో పొగడ్తలతో ముంచెత్తిన జేసీ.. తాటికొండ అడ్డరోడ్డులో మాత్రం చంద్రబాబుని టార్గెట్ చేశారు. కమ్మ జాతికి చంద్రబాబు ఏమో చేశారని అంతా ప్రచారం చేస్తున్నారు.. కానీ వాస్తవంగా.. కమ్మ జాతిని చంద్రబాబు కృష్ణా గోదావరిలో కలిపేశారని జేసీ అన్నారు. అమరావతిలో చంద్రబాబుకి భూములు లేవన్న విషయం అబద్ధమన్నారు. అమరావతిలో చంద్రబాబుకి భూములు ఉన్నాయని జేసీ చెప్పారు.
అటు సీఎం జగన్‌పైనా జేసీ విమర్శలు చేశారు. జగన్ తన తాత రాజారెడ్డి తప్ప ఎవరు చెప్పినా వినరన్నారు. ముసలవ్వలకు ముద్దు పెట్టగానే జగన్ కు ఓట్లేశారని.. ఇప్పుడు జగన్ చుక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి మీదనో కోపంతో.. రాజధాని రైతులను దెబ్బతీయొద్దని సీఎం జగన్ ను జేసీ కోరారు.