Jogi Ramesh Family Dispute : జోగి రమేశ్ కోడలు మేఘన సంచలన వ్యాఖ్యలు.. వైఎస్ జగన్ పేరు ప్రస్తావిస్తూ..
Jogi Ramesh Family Dispute : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఫ్యామిలీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జోగి రమేశ్ కోడుల మేఘన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Harish Thanniru
- Updated on- August 25, 2026 / 02:27 PM IST
Jogi Ramesh Family Dispute Daughter In Law Meghana Comments
Jogi Ramesh Family Dispute : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఫ్యామిలీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే జోగి రమేశ్ కోడలు మేఘన ఆ ఫ్యామిలీ నుంచి తనకు ఎదురైన ఇబ్బందులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా.. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కీలక విషయాలను వెల్లడించారు. జోగి రమేశ్ ఫ్యామిలీ తనను కూతురిలా చూసుకుంటే నేను ఇక్కడెందుకుంటాను అంటూ మేఘన ప్రశ్నించారు.
Also Read – Srisailam : శ్రీశైలం సత్రంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
పెండ్లికి ముందే తన భర్త రాజీవ్‌కు ఉన్న సమస్య గురించి జోగి రమేశ్, ఆయన సతీమణికి తెలుసని, కానీ, ఆ సమస్యను దాచిపెట్టి నన్ను బలిపశువును చేశారని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎదురైన ఇబ్బందిపై పెండ్లి జరిగిన కొన్ని రోజులకే జోగి రమేశ్, ఆయన సతీమణికి తెలియజేశానని.. కానీ, వారు తనకు న్యాయం చేయకపోగా.. నన్ను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేశారని మేఘన ఆరోపించారు. జోగి రమేశ్ కుటుంబం నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకునేందుకే నేను టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వద్దకు వెళ్లానని.. దానిలో దాపరికం ఏమీ లేదని మేఘన పేర్కొన్నారు. జోగి రమేశ్ తనకు న్యాయం చేసిఉంటే.. వసంత కృష్ణ ప్రసాద్ వద్దకు నేను వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.
పెండ్లి జరిగిన రెండు నెలలకే నామీద రాజీవ్ డైవర్స్ ఫైల్ చేయడం జరిగిందని, ఆ విషయం తనకు ఇటీవల తెలిసిందని మేఘన అన్నారు. జోగి రమేష్ కు తెలియకుండా ఇది జరగదని, అప్పటి నుంచే తనను వదిలించుకోవాలని ఆ ఫ్యామిలీ ప్లాన్ చేసినట్లు అర్ధమవుతుందని మేఘన అన్నారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందులపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికిసైతం ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఆ తరువాత కూడా తనకు ఇబ్బందులు తప్పలేదని.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు ఆయన కార్యాలయంకు కూడా మేము వెళ్లామని. కానీ, జగన్‌ను కలుసుకోలేక పోయామని మేఘన చెప్పారు.
పెండ్లికి ముందు వాళ్లు హిందువులు అని చెప్పారు. పెళ్లి అయ్యాక తెలిసింది వాళ్లు క్రైస్తవులు అని. ఇంట్లో అసలు హిందువుల పూజలు జరిగేవి కావు. మా అత్తమ్మ హిందూ దేవుళ్లపై అభ్యంతరకరంగా మాట్లాడేవారు. జోగి రమేశ్ వాళ్ల ఇంట్లో అసలు పూజగది లేదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. ఇప్పటికే పోలీసులకు పలు ఆధారాలను అందజేశాను. ఎఫ్ఐఆర్‌లో నమోదైన ప్రతి విషయంపై నా వద్ద ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు వాటిని మీ ముందు ఉంచుతానని మేఘన పేర్కొన్నారు. జోగి రమేశ్ దంపతులను సొంత అమ్మానాన్న అనుకున్నా. కానీ, కొడుకు సమస్య ఏంటో తెలిసి కూడా వాళ్లు నాకు అన్యాయం చేశారని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు.
