KA Paul : చంద్రబాబుకు కేఏ పాల్ ఛాలెంజ్.. ఆ ముగ్గురు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు

టీడీపీ సభకు 600 కోట్లు ఖర్చు చేశారు.. బుద్ధిఉన్నవాడు ఎవరైనా చంద్రబాబుకు ఓటేస్తారా అంటూ పాల్ విమర్శించారు. జగన్ కు ప్రభుత్వాన్ని ఎలా నడపుతున్నారో ..

KA Pal

Praja Shanti Party President KA Paul: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని బాగా పాలించాలని జగన్ కోసం పాల్ ప్రార్థన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు, పవన్ మీటింగ్ కు వందమందైనా డబ్బులు ఇవ్వకుండా వచ్చారా? అంటూ ప్రశ్నించారు. లోకేశ్ కు మాటలు రావు.. సీనియర్ ఎన్టీఆర్ కి లోకేశ్ కు ఏమైనా పోలిక ఉందాఅని ప్రశ్నించారు. చంద్రబాబు నన్ను గతంలో అనేకసార్లు కలిశారు.. ఆయన అడిగినవన్నీ చేశానని పాల్ చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని వేలకోట్లు ఖర్చుపెడుతున్నారు.. గుంటూరు, గుడివాడ టికెట్ల కోసం ఎన్ఆర్ఐ నుంచి కోట్లు తీసుకున్నాడని పాల్ ఆరోపించారు.

Also Read : YS Jagan Mohan Reddy Birthday: సీఎం జ‌గ‌న్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

చంద్రబాబు సీఎం అయితే అవినీతి ఆంధ్ర అవుతుందని కేఏ పాల్ విమర్శించారు. ఒకవేళ అధికారంలోకి వస్తే 10 లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారో చెప్పాలి? చంద్రబాబు, లోకేశ్ ఎవరైనా నాతో డిబెట్ కు రావాలని పాల్ అన్నారు. గతంలో చంద్రబాబు ఉద్యోగాలు కల్పించలేదు.. ఇప్పుడు 60 లక్షల మంది నిరుద్యోగులున్నారు.. వారికి ఎలా ఉద్యోగాలు ఇస్తారని, గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చని మీరు ఇప్పుడెలా అమలు చేస్తారంటూ చంద్రబాబు ను ప్రశ్నించారు. 68,700 కోట్ల హామీలు ఇచ్చారు.. ఏపీ బడ్జెట్ 2లక్షల కోట్లు లేదు.. లక్షా 50 వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తారు?ఏపీ అప్పులు తీర్చాలంటే, అభివృద్ధి చేయాలంటే లక్షా యాబై వేల కోట్లు కావాలి.. మాటలురాని లోకేశ్ ఏం చేస్తాడుంటూ ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్రలో తారకరత్న చనిపోయారు.. సీబీఐ, సీఐడీ దర్యాప్తు కు చంద్రబాబు సిద్ధమా అంటూ పాల్ ప్రశ్నించారు.

Also Read : Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. మంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్‌కు వాళ్ల కష్టాలు కనిపించలేదా?

నిన్న టీడీపీ సభకు 600 కోట్లు ఖర్చు చేశారు.. బుద్ధిఉన్నవాడు ఎవరైనా చంద్రబాబుకు ఓటేస్తారా అంటూ పాల్ అన్నారు. జగన్ కు ప్రభుత్వాన్ని ఎలా నడపుతున్నారో అర్థం కావడం లేదు.. నేనైతే సూసైడ్ చేసుకునేవాడిని. జగన్ నాతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని అన్నారు. ఏపీలో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. ఏపీ అప్పులు నేను కడతా. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో నేను చేసి చూపిస్తా అని పాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు 50కోట్లు ఇచ్చే బదులు 50 లక్షలు పెట్టి మీటింగ్ పెడితే ఎమ్మెల్యే అవుతారు. ఏపీలో బీజేపీ తొత్తులకు బుద్ధి చెప్పాలి. ఏపీ కోసం ఎవరితో అయినా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని పాల్ అన్నారు. ఎన్టీఆర్ పై ప్రేమ ఉన్నవారు చంద్రబాబు, లోకేష్ కి ఓటువేయరు. నిజమైన వారసులకు టిడీపీని అప్పగించాలని పాల్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకై ఆమరణ నిరాహారదీక్ష  చేయడానికి నేను సిద్ధమని పాల్ అన్నారు. చంద్రబాబుకు పాల్ ఓ ఛాలెంజ్ చేశారు. జగన్ నాతో కలిసి పనిచేస్తే టీడీపీకి ఒక్క సీటుకూడా రాదు.. కుప్పంలో చంద్రబాబు కూడా గెలవడని పాల్ అన్నారు.