Karnati Rambabu
Karnati Rambabu: విజయవాడ దుర్గగుడి (Durga Temple) ఛైర్మన్, ఈవో మధ్య విభేదాలు బయటపడ్డాయి. దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం సూపరింటెండెంట్ నగేశ్ ఆస్తులపై ఏసీబీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దుర్గగుడి ఛైర్మన్, ఈవో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.
గత మూడు నెలలుగా పాలకమండలి సూచనలను పరిగణలోకి తీసుకోవడం లేదంటూ ఈవోపై సంచలన ఆరోపణలు చేశారు చైర్మన్ కర్నాటి రాంబాబు ( Karnati Rambabu). గతంలోనే నగేశ్ అవినీతి ఆరోపణలపై ఈవోకు రాంబాబు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారట. అయినప్పటికీ ఈవో పట్టించుకోలేదని ఆయన చెప్పారు.
ఈవో నిర్లక్ష్యంగానే.. నగేశ్ అరెస్ట్ తో దుర్గగుడి పరువు పోయిందని కర్నాటి రాంబాబు అంటున్నారు. తాజాగా ఆయన 10 టీవీతో మాట్లాడుతూ… “సూపరింటెండెంట్ నగేశ్ పై గతంలోనే ఈవోకు ఫిర్యాదు చేశాం. పట్టించుకోకపోగా మమ్నల్ని అవహేళన చేస్తూ ఈవో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఉన్న నగేశ్ కు రెండు షిఫ్టులు వేయడం కరెక్ట్ కాదని లిఖిత పూర్వకంగా లెటర్ ఇచ్చాం.
ఈవో భ్రమరాంబ (EO Bramaramba) ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దుర్గగుడిలో ఏవైనా జరిగితే విచారణాధికారిగా నగేశ్ నే వేయడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదు. మేము లెటర్ ఇచ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే అమ్మవారి ప్రతిష్ఠకు భంగం కలిగి ఉండేది కాదు. నగేశ్ కు ఈవో ఎందుకు కొమ్ము కాస్తున్నారో అర్థం కావడం లేదు. నగేశ్ అక్రమంగా సంపాదించిన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించి ఆయన్ను అరెస్టు చేశారు.
ద్వారకా తిరుమలలో నగేశ్ అవినీతి నేపథ్యంలో ఆయన జీతం కట్ అవుతున్న విషయం ఈవోకు తెలియదా? నగేశ్ వ్యవహారంలో ఈవో పాత్రపై అనుమానాలు ఉన్నాయి. ఈవో వ్యవహారాన్ని ఇంతటితో వదలం. పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపిస్తాం. దుర్గగుడిలో అవినీతికి ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదు” అని వ్యాఖ్యానించారు.
Thatikonda Rajaiah : టికెట్ నాదే, గెలుపు నాదే : తాటికొండ రాజయ్య