Andhra Pradesh Tenth Exams(Photo : Google)
Andhra Pradesh-Tenth Class Papers : ఏపీలో టెన్త్ విద్యార్థులకు (AP Tenth Class) ముఖ్యమైన అలర్ట్. పదో తరగతి ప్రశ్నాపత్రాల్లో(Tenth Class Question Papers) స్వల్పంగా మార్పులు చేసింది ప్రభుత్వం. మొదటి, రెండో భాషా క్వశ్చన్ పేపర్లలో మార్పులు తీసుకొచ్చింది. తెలుగు, హిందీ, ఒడియా, ఉర్దూ, కన్నడ, తమిళ ప్రశ్నపత్రాల్లో చేంజస్ చేసింది.
Also Read..UPSC Recruitment : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్న యూపీఎస్సీ
సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తెలుగు ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు చేసింది. ఈ మేరకు మార్పులకు సంబంధించి బ్లూప్రింట్లను వెబ్ సైట్ లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వెయిటేజీతో పాటు మోడల్ పేపర్లను వెబ్ సైట్ లో పెట్టినట్లు వెల్లడించింది. సైన్స్ ప్రశ్నపత్రం నమూనా కూడా త్వరలోనే వెబ్ సైట్లో పెడతామంది. కాగా.. ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ పేపర్లలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.