AP Government
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధించింది. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లోనే సభలు నిర్వహించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.
Kandukur Incident: కందుకూరు ఘటనలో మృతుల కుటుంబాలకు టీడీపీ రూ.23.5లక్షల పరిహారం..
ఏదైనా సభలు నిర్వహించుకోవాలంటే ప్రధాన రహదారులకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. సభలు నిర్వహించుకొనేందుకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని, ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను ఏపీ హోంశాఖ మంగళవారం జారీ చేసింది.
Guntur Stampede : ఇలా జరుగుతుందని ఊహించలేదు.. గుంటూరు తొక్కిసలాటపై చంద్రబాబు దిగ్భ్రాంతి
ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సభల్లో తొక్కిసలాటలు చోటు చేసుకున్న విషయం విధితమే. కందుకూరులో జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగానే తొక్కిసలాట చోటుచేసుకోవటంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండురోజుల క్రితం గుంటూరులో చంద్రన్న చీరల పంపిణీ కార్యక్రమం పేరుతో నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. బాబు వెళ్లిన తరువాత చీరలకోసం ప్రజలు ఒక్కసారిగా దూసుకురావటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. వరుస ఘటనల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.