Vizag Kidney Racket : మద్యం తాగించి నా కిడ్నీ దొబ్బేశారు

కిడ్నీలను రోడ్డు పక్కన ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు. మనిషి శరీరంలో కీలకంగా ఉండే కిడ్నీలను అమ్ముకునే ముఠా ఆగడాలు అన్నీ ఇన్నీకావు.  మద్యం తాగే అలవాటు ఉన్నవారికి మద్యం తాగించి కిడ్నీలను దోచేస్తున్నారు.

Vizag Kidney Racket

Vizag Kidney Racket :  కిడ్నీలను రోడ్డు పక్కన ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు. మనిషి శరీరంలో కీలకంగా ఉండే కిడ్నీలను అమ్ముకునే ముఠా ఆగడాలు అన్నీ ఇన్నీకావు. విశాఖ పెందుర్తి కిడ్నీ రాకెట్ గుట్టురట్టు నప్పటినుంచి బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మొరపెట్టుకుంటున్నారు. డబ్బులు ఆశ పెట్టి కిడ్నీలను రోడ్డు పక్కన ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. ఆర్థిక సమస్యలో ఉండేవారిని టార్గెట్ గా చేసుకుని వారికి డబ్బులు ఆశపెట్టి కిడ్నీ అమ్మేస్తున్నారు. భారీ మొత్తంలో ఆశ పెట్టి తీరా కిడ్నీ తీసుకున్నాక ఏదో నామమాత్రంగా డబ్బులు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు కేటుగాళ్లు. దీంతో శరీరంలో ఓ అవయవాన్ని అమ్ముకుని తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోలేక..వారి బాధను వారిలోనే దిగమింగుకుంటున్నారు బాధితులు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి డబ్బులు ఆశ పెట్టటం, వాహనాలు ఆశ ఉన్నవారికి వాహనాలు కొని ఇస్తామనటం, మద్యం తాగే అలవాటు ఉన్నవారికి మద్యం పోసి కిడ్నీలను కొట్టేయటం ఇలా కిడ్నీ రాకెట్ కేటుగాళ్లు కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు. అలా విశాఖలో కిడ్నీల ముఠా కిడ్నీలను అమ్మేసుకుంటున్నారు. అలా వీరి మాయలో పడి ఎంతోమంది తమ కిడ్నీలను అమ్మేసుకుంటున్నారు.తీరా డబ్బులు ఇచ్చే సమయంలో ఏవో మాయ మాటలు చెప్పి నామమాత్రంగా డబ్బులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు కిడ్నీ రాకెట్ ముఠాలోని కామరాజు, ఎలీనా, శ్రీను అనే వ్యక్తులు. దీంతో బాధితులు మాకు ఇస్తానన్న డబ్బుల ఇవ్వలేదంటూ అమాయంగా చెబుతున్నారు. అలా ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్ ముఠా చేసే దారుణాలు అన్నీ ఇన్నీ కావు.

Kidney Racket : విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. రూ.8,50,000 ఇస్తామంటూ కిడ్నీ తీసుకుని మోసం

ఇలా అమాయకులను మోసం చేసి కిడ్నీలు అమ్మేసే విషయంలో గతంలో విశాఖలోని శ్రద్ధ ఆస్పత్రిపై పలు ఆరోపణలు వచ్చాయి. తాజాగా పెందుర్తిలోని శ్రీ తిరుమల ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ బయటపడింది. కిడ్నీ ఇచ్చిన వ్యక్తికి ముందుగా ఆశపెట్టినంత డబ్బు ఇవ్వకపోవటం ఈ కిడ్నీ రాకెట్ దందా బయటపడింది. బాధితుడు వినయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కిడ్నీ రాకెట్ దారుణాలు బయటపడ్డాయి. మధురవాడ వాంబే కాలనీకి చెందిన కామరాజు ఆస్పత్రికి బాధితుడికి మధ్య మధ్యవర్తిత్వం నిర్వహించి తన కిడ్నీ తీసుకున్నారని తీరా తీసుకున్నాక చెప్పినంత డబ్బులు ఇవ్వలేదని వాపోయాడు బాధితుడు. పెందుర్తిలోని తిరుమల హాస్పిటల్ లో వినయ్ కుమార్ అనే వ్యక్తి నుంచి కిడ్నీ తీసుకున్నారు.

కిడ్నీకి రూ.8,50,000 ఇస్తామంటూ కామరాజు, శ్రీను అనే ఇద్దరు మధ్యవర్తులు వినయ్ కుమార్ కు డబ్బు ఆశ చూపారు. డీల్ కుదుర్చుకున్న ప్రకారమే వినయ్ కుమార్ కిడ్నీ ఇచ్చాడు. ఆపరేషన్ తర్వాత రెండున్నర లక్షల రూపాయలే ఇవ్వడంతో వినయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కాగా..ఈ కేసులో నిందుతులకు ఎవరు సహకరించారు? దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Visakha Kidney Racket Case : విశాఖ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సంచలన విషయాలు