వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని రాజధాని అంశంపై చంద్రబాబుకి సవాల్ విసిరారు. దమ్ముంటే.. 21మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. రాజధానిపై రెఫరెండంకి
వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని రాజధాని అంశంపై చంద్రబాబుకి సవాల్ విసిరారు. దమ్ముంటే.. 21మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. రాజధానిపై రెఫరెండంకి రావాలని చంద్రబాబుకి సవాల్ విసిరారు. ప్రజలు అమరావతిని రాజధానిగా కోరుకుంటే 21మంది గెలుస్తారని చెప్పారు. చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ దొంగ అని ఘాటు విమర్శలు చేశారు కొడాలి నాని. బోస్టన్ గ్రూప్, జీఎన్ రావు నివేదికలను భోగి మంటల్లో తగలబెట్టాలన్న చంద్రబాబు వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.
రిపోర్టులను భోగి మంటల్లో వేయడం కాదు.. గత రోహిణి కార్తె మంటల్లో టీడీపీని ప్రజలు తగలబెట్టారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు మాయమాటలతో రైతులను మభ్యపెట్టారని చెప్పారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని అన్నారు. రైతుల భూములు బలవంతంగా లాక్కున్నారని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా కోరే హక్కు టీడీపీకి లేదని కొడాలి నాని అన్నారు.