Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై మరో ఫిర్యాదు.. వివాదాస్పద వ్యాఖ్యలు కొత్త చిక్కులు తెస్తాయా?

Kodali Nani : ఉపా చట్టంపై వ్యాఖ్యలు, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి కొడాలి నానిపై విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందినట్టు సమాచారం..

Kodali Nani Faces Another Complaint

Kodali Nani : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా ఫిర్యాదు నమోదైంది. ఉపా (UAPA) చట్టాన్ని ‘ఉప్మా చట్టం’ అంటూ హేళన చేశారంటూ కొడాలిపై ఆరోపణలు వచ్చాయి. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉమ్మడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కొడాలి నాని (Kodali Nani) వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పేర్కొన్నట్టు తెలుస్తోంది.

Read Also : TG Anganwadi Recruitment 2026 : అంగన్‌వాడీ ఉద్యోగాల జాతర.. జస్ట్ ఇంటర్ పాసైతే చాలు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

ఇప్పటికే, కొడాలి నానిపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మరోసారి పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఫిర్యాదును ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేయాలా లేదా అనే విషయంపై పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. పోలీసులకు ఫిర్యాదు మాత్రమే అందినట్టు తెలుస్తోంది.