Andhra pradesh : కన్నా బలమైన లీడర్ అంటూ బాబు కితాబు .. అంత సీన్ లేదంటున్న నాని

Andhra pradesh : మాజీ మంత్రి..ఏపీ బీజేపీ మాజీ అధ్యయుడు కన్నా లక్ష్మీనారాయణ కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కన్నాకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు టీడీపీలో చేరారు. టీడీపీ కార్యాలయ పరిసరాలు ఆ పార్టీ కార్యకర్తలలో నిండిపోయాయి. స్టేజీపై తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కన్నా బలమైన నాయకుడు అని ఆయనను ఓడించటానికి చాలా యత్నించాం కానీ సాధ్యం కాలేదని అన్నారు. కన్నా టీడీపీలో చేరటం శుభపరిణామం అని అన్నారు. తనకుంటూ ఓ ప్రత్యేకత కలిగిన వ్యక్తి అని చంద్రబాబు కన్నాను ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. కన్నా బలమైన నాయకుడు అంటూ చంద్రబాబు అనటం హాస్యాస్పదం అని కన్నాకు అంత సీన్ లేదు అంటూ తీసిపారేశారు. కన్నా టీడీపీలో చేరినా తమ పార్టీకొచ్చినష్టమేంలేదని ఇటువంటి నేతలకు చాలామందినే చూశాం అంటూ ఎద్దేవా చేశారు.

Kanna Lakshminarayana: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గుంటూరు నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ మంగళగిరి టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఆయనతో వేలాది మంది అభిమానులు వచ్చారు. గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద కూడా టీడీపీ ఫ్లెక్సీలు భారీగా కనపడ్డాయి. మాజీ సీఎంలు ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేత లోకేశ్‌ ఫ్లెక్సీలను కార్యకర్తలు ఏర్పాటు చేశారు.

గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణకు కాపు సామాజిక వర్గంలో పట్టు ఉంది. నిన్న పలువురు టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఏపీ బీజేపీ నేతల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. సోము తీరుతో ఏపీలో బీజేపీకి తీవ్ర నష్టమని పలువురు కాషాయనేతలు వాపోతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు