పోలీసులు అధీనంలో కోడెల శివప్రసాద్ ఇల్లు

  • Publish Date - September 16, 2019 / 09:01 AM IST

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా కోడెల నివాసాన్ని పోలీసుల అధీనంలోకి తీసుకున్నారు. గేటు దూకి కోడెల నివాసంలోకి దూసుకెళ్లిన పోలీసులు ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం ఆత్మహత్యపై క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తున్నారు. మరోపక్క డాగ్ స్వ్కాడ్ కూడా రంగంలోకి దిగి ఆధారాలను సేకరిస్తున్నారు.  

కాగా పార్టీలో సీనియర్ నేతగా పేరొందిని కోడెల మరణాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. తోటి నేత మరణంతో దిగ్ర్భాంతికి గురయ్యారు. ఈ క్రమంలో కోడెల నివాసానికి టీడీపీ నేతలు, సన్నిహితులు..కార్యకర్తలు, అభిమానులు  భారీగా తరలివస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని వారు అంటున్నారు.  30 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఎన్నో క్లిష్టపరిస్థితుల్లో కూడా ఎంతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొన్న నేతల పిరికిగా ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయాన్ని నమ్మలేకపోతున్నామనీ..తమ ప్రియతమ నేత మరణం చాలా బాధకరమని వారు అంటున్నారు. 

2014 ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న కోడెల 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. అనంతరం పలు ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కోడెల శివప్రసాద్ మరణం అందరినీ తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేస్తోంది. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య విషయంలో పలు అనుమానాలు వెల్లువెత్తుతున్న క్రమంలో పోలీసులు నిజాలను నిగ్గు తేల్చేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.