krishna district mutton price :
మటన్ కూర తినాలని ఆశ..కొనాలంటే చుక్కల్లో ఉండే రేటు. కేజీ మటన్ రూ.800 నుంచి రూ.1000కూడా అమ్ముతోంది. కానీ కిలో రూ.800లు అమ్మే మటన్ కిలో రూ.200లకే వస్తుందంటే కొనకుండా ఉంటారా చెప్పండీ..పైగా చికెన్ రేటే కిలో రూ.250 వరకూ అమ్ముతోంది. అటువంటిది రూ.200లకే మటన్ వస్తుందంటే జనాలు ఎగబడకుండా ఉంటారా? అదిగో గత సోమవారం కృష్టా జిల్లాలో కిలో మటన్ 200ల రూపాయలకే ఇస్తామని మటన్ వ్యాపారి ప్రకటించటంతో జనాలు ఎగబడి మరీ వెళ్లిపోయారు. రూ.200లకే కిలో మటన్ కావాలంటే ఇక్కడొక ట్విస్ట్ కూడా ఉందండోయ్..అదే ఆదార్ కార్డు.
https://10tv.in/4-killed-one-injured-car-accident-near-rompicherla-major-canal-guntur-district/
కృష్ణా జిల్లాలో జి.కొండూరులో ఓ మటన్ వ్యాపారి కిలో రూ.200 అని బోర్డు పెట్టేసరికి జనాలు పోటెత్తారు. ఆధార్ కార్డు ఉన్నవారికే ఈ ఆఫర్ అని ప్రకటించినా, ప్రజలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు సరికదా… ఇరుగుపొరుగు వాళ్ల ఆధార్ కార్డులు పట్టుకొచ్చి వేటమాంసం షాపు ముందు క్యూకట్టారు.
ప్రజల నుంచి మంచి స్పందన రావటంతో సదరు మటన్ వ్యాపారి తన ట్రిక్ భటే వర్కౌట్ అయిందని తెగ సంబరపడిపోయాడు. మంగళవారం కూడా అదేరేటుకు వస్తుందని వచ్చిన జనాలకు కాదు కాదు పాత రేటుకే మటన్ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు.దీంతో జనాలు మండిపడ్డారు.
ఒక్క రోజు మటన్ రూ.200కు అమ్మడం ఏంటి.. మళ్లీ మరుసటి రోజే రేట్లు పెంచడంపై మండిపడ్డారు. షాపు యజమానితో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఒక్కరోజులోనే రూ.400 పెంచేశారని.. రూ.200 అమ్మిన మటన్‌ను రూ.600కు ఎలా పెంచుతారని ప్రశ్నించారు.
కాగా..ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే..సోమవారం అమ్మిన మాంసం చచ్చిన గొర్రెలదంటూ ఆరోపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగాలతో చచ్చిన జీవాలను తెచ్చి అమ్మకాలను పెంచుకునే ఎత్తుగడలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై అధికారులు విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. కృష్ణా జిల్లాలో జి.కొండూరు ప్రాంతంలో అమ్మే వేటమాంసానికి జిల్లాస్థాయిలో మంచిపేరుంది. వ్యాపారుల మధ్య పోటీతోనే మాంసం ధరలు భారీగా తగ్గించినట్టు తెలుస్తోంది.