Kidnap
kidnapping attempt Failed : కృష్ణా జిల్లా పోలీసులు కిడ్నాప్ యత్నాన్ని విఫలం చేశారు. సాంకేతికత సహాయంతో అతి తక్కువ సమయంలోనే కిడ్నాప్ కేసును ఛేదించారు. అవనిగడ్డలో అపహరణకు గురికాబడిన బాలుడిని 3 గంటల వ్యవధిలోనే అతని తల్లి దండ్రుల చెంతకు పోలీసులు చేర్చారు. జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
ఫిర్యాదుకు తక్షణమే స్పందించిన పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. సురక్షితంగా బాలుని తల్లిదండ్రుల చెంతకు చేర్చినందుకు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. తన కుమారుణ్ణి సురక్షితంగా అప్పగించినందుకు తల్లిదండ్రులు ఎస్పికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.