Krishna News: కొడుకు ఆత్మహత్య.. కోడల్ని ఇంట్లో నుంచి గెంటేసిన అత్త

కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజూరు గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొడుకు చనిపోవడంతో కోడలిని ఇంటి నుండి గెంటేసి ఇంటికి తాళాలు వేసింది అత్త

Krishna News Husband Leave His Life

Krishna News: కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజూరు గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొడుకు చనిపోవడంతో కోడలిని ఇంటి నుండి గెంటేసి ఇంటికి తాళాలు వేసింది అత్త.. వివరాల్లోకి వెళితే గత నెల 11వ తేదీన చల్లా గోపి అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఆత్మహత్యకు గోపి భార్య సంధ్యారాణి, ఆమె కుటుంబ సభ్యులే కారణమని గోపి తల్లి సామ్రాజ్యం వారితో వాగ్వాదానికి దిగింది. అంతే కాదు కొడుకు దినకర్మలకు కోడలు బంధువులను రానివ్వలేదు సామ్రాజ్యం.

గోపి మరణించిన నాటి నుంచి తన కొడుకు నీ వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని సంధ్యారాణిని వేధించడం మొదలు పెట్టింది అత్త.. ఈ నేపథ్యంలోనే సంధ్యారాణిని ఇంట్లోంచి గెంటేసి తాళం వేసింది. దీంతో తన రెండేళ్ల బాలుడితో ఇంటి ముందు నిరీక్షిస్తూ కూర్చుంది. మరోవైపు సంప్రదాయంగా దినకర్మలు చేయకపోవడంతో సంధ్యారాణిని తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు సుముఖత చూపడంలేదు. దీంతో ఆమె ఎటు వెళ్లలేని స్థితిలో ఇంటిముందే కూర్చొని న్యాయం కోసం ఎదురుచూస్తుంది.