Congress: 5 రాష్ట్రాలకు కొత్త మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం.. ఏపీకి ఎవరో తెలుసా?

ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వివరించారు.

LAM THANTIYA KUMARI

Congress – Lam Thantiya Kumari: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), బిహార్ (Bihar), జమ్మూకశ్మీర్(Jammu Kashmir), త్రిపుర (Tripura), రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రాలకు ఏఐసీసీ (AICC) కొత్త మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లామ్ తాంతియా కుమారి నియమితులయ్యారు. బిహార్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సర్వత్ జహన్ ఫాతిమా, జమ్మూకశ్మీర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షమీమ రైనాను ఏఐసీసీ నియమించింది.

త్రిపుర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్బని ఘోష్ చక్రవర్తి, రాజస్థాన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాఖీ గౌతమ్ నియమితులయ్యారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో వివరించారు.

Presidents of Pradesh Mahila Congress in their respective states