Vinayaka Chavithi 2025: గణేశ్ మండపాలు పెడుతున్నారా? ప్రభుత్వం గుడ్‌న్యూస్
మండపాలను తాత్కాలికంగా మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేసింది. కరెంటు, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

Vinayaka Chavithi 2025
Vinayaka Chavithi 2025: గణేశ్ మండపాలు పెడుతున్న వారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా గుడ్‌న్యూస్ చెప్పాయి.
గణేశ్ చతుర్థి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలతో పాటు దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గా మాత మండపాలకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, మండపాలను తాత్కాలికంగా మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేసింది. కరెంటు, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
Also Read: ఖైరతాబాద్ మహాగణపతి రెడీ.. తుది మెరుగులు ఎలా దిద్దుతున్నారో చూడండి..
ఇప్పుడు ఏపీ సర్కారు కూడా..
ఏపీ సర్కారు కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. గణేశ్ చతుర్థి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు ఉచితంగా విద్యుత్తు ఇస్తామని ప్రకటించింది.
ఈ విషయాన్ని తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. “వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులకు శుభవార్త. వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నా దృష్టికి మీరు తీసుకువచ్చిన వినతిని సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో చర్చించాను.
వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేయనుంది. రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గా పందిళ్లకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తాం. వినాయక చవితి, దసరా ఉత్సవాల ఉచిత విద్యుత్ కోసం రూ.25 కోట్లు కూటమి ప్రభుత్వం వెచ్చించనుంది” అని తెలిపారు.