AP News: 2 గుడ్‌న్యూస్‌లు.. మహిళల బ్యాంక్‌ అకౌంట్లలోకి త్వరలోనే డబ్బులు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులూ వచ్చేస్తున్నాయ్..  

విద్యా శాఖపై సమీక్షించి, పథకానికి సంబంధించి పెండింగ్‌ ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ చేసే ఫైలుపై లోకేశ్ సంతకం చేశారు. త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి.

AP News: 2 గుడ్‌న్యూస్‌లు.. మహిళల బ్యాంక్‌ అకౌంట్లలోకి త్వరలోనే డబ్బులు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులూ వచ్చేస్తున్నాయ్..  

AP News

Updated On : August 25, 2025 / 2:56 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆమోదం తెలిపారు. విద్యా శాఖపై సమీక్షించి, పథకానికి సంబంధించి పెండింగ్‌ ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ చేసే ఫైలుపై లోకేశ్ సంతకం చేశారు.

త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది.

స్కూలుకి వెళ్తుఉన్న ప్రతి విద్యార్థికి ప్రతి ఏడాది రూ.13000 చొప్పున వారని తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది సర్కారు. ఈ పథకానికి ఈ ఏడాది జూన్ నుంచి శ్రీకారం చుట్టారు.

ఇప్పటికే ఈ స్కీమ్‌ కింద తొలి విడత నిధులు జమ అయ్యాయి. అర్హులై ఉండి కూడా పలువురికి నిధులు జమకాలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో అటువంటి వారు దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించారు.

Also Read: భారత్ దెబ్బతో వణికిపోయిన జైష్-ఎ-మొహమ్మద్… ఇప్పుడు ఆ ముసుగులో డిజిటల్ దందా!