Chittur Jawan Saiteja : సాయితేజ అంత్యక్రియలు.. బరువెక్కిన జన హృదయం

పారా కమాండో సాయితేజ భౌతికకాయాన్ని బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్‌ నుంచి.. రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు తరలిస్తున్నారు...

Saiteja

Lance Naik Sai Teja : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన.. పారా కమాండో సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో 2021, డిసెంబర్ 12వ తేదీ ఆదివారం జరగనున్నాయి. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్‌ నుంచి.. రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు తరలిస్తున్నారు. ఉదయం 10గంటలకు మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఎగువరేగడి గ్రామంలో సాయితేజ అంత్యక్రియలు నిర్వహిస్తారు. కర్ణాటక సరిహద్దు చీకలబైలు నుంచి భారీ ర్యాలీగా భౌతిక కాయాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. మరోవైపు సాయితేజ నివాసం వద్దే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.. సైనిక లాంఛనాలతో సాయితేజకు తుది వీడ్కోలు పలకనుంది ఇండియన్‌ ఆర్మీ.

Read More : IAF Chopper Crash : తండ్రి ఆర్మీ టోపీ ధరించి సెల్యూట్ చేసిన కొడుకు..వీడియో వైరల్

డీఎన్ఏ టెస్టుల ఆధారంగా.. సాయితేజ మృతదేహాన్ని ఆర్మీ అధికారులు గుర్తించారు. ఆస్పత్రిలో ఆర్మీ అధికారులు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత.. ఢిల్లీ నుంచి సాయితేజ మృతదేహాన్ని కోయంబత్తూరు ఎయిర్‌బేస్‌కు తరలించారు. అక్కడి నుంచి బెంగళూరుకు ఎయిర్ లిఫ్ట్ చేసి.. ఆర్మీ బేస్ ఆస్పత్రిలో ఉంచారు. అక్కడ.. సైనికాధికారులు శ్రధ్ధాంజలి ఘటించి.. సెల్యూట్ చేశారు.

Read More : BWF World Championships : ప్రపంచ బ్యాడ్మింటన్..అందరి చూపు సింధు వైపు

చిత్తూరు జిల్లా మొత్తం సాయితేజ భౌతికకాయం కోసం బరువెక్కిన హృదయాలతో ఎదురుచూస్తోంది. సాయితేజ తమతో మాట్లాడిన చివరి విషయాలు గుర్తుకు తెచ్చుకుని తల్లడిల్లిపోతున్నారు మరోవైపు సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సాయితేజ కుటుంబానికి 50 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. ఆ చెక్కును మంత్రి పెద్దిరెడ్డి సాయితేజ కుటుంబానికి అందించిన సంగతి తెలిసిందే.