Tammineni Sitaram : మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సహా కుటుంబ సభ్యులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు

Tammineni Sitaram : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదైంది.

Tammineni Sitaram

Tammineni Sitaram : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి, కుమారుడు చిరంజీవి నాగ్‌తో పాటు పలువురిపై శ్రీకాకుళం జిల్లాలో ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదైంది. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : Gold Price Drop : పతనమవుతున్న పడిసి ధరలు.. కారణాలివే.. తులం గోల్డ్ రూ.లక్షకు చేరుతుందా.. నిపుణులు అంచనాలివే..

పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం సమీపంలోని చాపురం సత్యసాయి నగర్‌లో ఉన్న సుమారు రూ.4కోట్ల విలువైన 900 గజాల భూమిని నకిలీ పత్రాల ఆధారంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు అందింది. ఈ భూమి అందవరపు గోవిందరాజులుకు చెందినదిగా పేర్కొన్నారు. గోవిందరాజులు జీవించి ఉండగానే ఆయన పేరిట నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆమదాలవలస సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు.

ఈ వ్యవహారంపై గోవిందరాజుల అల్లుడు కనకలింగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి, కుమారుడు చిరంజీవి నాగ్‌లపై కూడా కేసు నమోదు చేశారు. అలాగే అప్పటి ఆమదాలవలస సబ్-రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.