Samadhaan Center: ఆయిల్ పామ్ వ్యాపారం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని సీహెచ్.పోతేపల్లిలో కొత్త సమాధాన్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ప్రకటించింది. ఇది కంపెనీకి 6వ సమాధాన్ కేంద్రం. ఆయిల్ పామ్ రైతులకు విజ్ఞానం, సాధనాలు, సేవలు, పరిష్కారాల సమగ్ర ప్యాకేజీని అందించే వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్ సమాధాన్ అని గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ డైరెక్టర్ బుర్జిస్ గోద్రెజ్ అన్నారు.
పామాయిల్ పరిశ్రమలో కీలకమైన తోడ్పాటుదారునిగా ఉండటమే ఈ కేంద్రాల లక్ష్యమని, తాజా వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా వారి ఉత్పాదకతను పెంచడంతో పాటుగా రైతులు తమ దిగుబడికి మెరుగ్గా రాబడిని పొందటంలో ఆయిల్ పామ్ రైతులకు సహాయం చేస్తుందని ఆయన అన్నారు. సమాధాన్ కేంద్రాల నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా, ఆయిల్ పామ్ రైతులకు విజ్ఞానం, సమకాలీన సాంకేతికతలను పొందే అవకాశం అందించడంపై దృష్టి పెట్టాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపారు.