పవన్ అవకాశవాది : ఏపీకి ద్రోహం చేసిన బీజేపీతో పొత్తా

బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని

  • Publish Date - January 16, 2020 / 02:51 PM IST

బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని

బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించడం చర్చకు దారితీసింది. బీజేపీ-జనసేన పొత్తుపై వామపక్షాలు తీవ్రంగా స్పందించాయి. పవన్ వైఖరిని లెఫ్ట్ పార్టీలు తప్పుపట్టాయి. పవన్ అవకాశవాది అని ఆరోపించాయి. బీజేపీతో జనసేన కలవడాన్ని ఖండిస్తున్నామని సీపీఎం నేత మధు అన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని 2019 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని, అలాంటి పార్టీతో పవన్ పొత్తు పెట్టుకోవడం దారుణం అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే బీజేపీతో కలిశామని పవన్ చెప్పడం ప్రజలను మోసగించడమే అన్నారు. సీఏఏను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయని, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న బీజేపీతో చేతులు కలపడం పవన్ అవకాశవాదాన్ని తెలుపుతుందని సీపీఎం నేత మధు అన్నారు.

బీజేపీ-జనసేన పొత్తుని సీపీఐ కూడా ఖండించింది. వామపక్ష భావజాలమని చెప్పిన పవన్.. బీజేపీతో కలవడం హేయమైన చర్య అన్నారు. అమరావతి రాజధాని కోసం బీజేపీతో కలిసి పవన్ పోరాటం చేయడంలో తప్పు లేదు..కానీ ఆ వంకతో బీజేపీతో కలవడం దారుణం అన్నారు. రాజధాని రైతులకు సీపీఐ పూర్తి మద్దతు ఉంటుందని నారాయణ తెలిపారు. అమరావతి రాజధానిగా ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారని, దానికి విలువ లేదా అని జగన్ ప్రభుత్వాన్ని నారాయణ ప్రశ్నించారు. అమరావతి రాజధాని కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. అన్ని పక్షాలతో కలిసి చలో అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు.

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. కలిసి పని చేయాలని నిర్ణయించాయి. ఎలాంటి షరతులు లేకుండా కలిసి ముందుకు సాగాలని, ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ-జనసేన డెసిషన్ తీసుకున్నాయి. విజయవాడలో సంయుక్త సమావేశం తర్వాత పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు బీజేపీ-జనసేన నేతలు. 2024లో ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ-జనసేన పని చేస్తాయని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 

పవన్ కళ్యాణ్ వారం రోజులుగా బీజేపీతో పొత్తు వైపుగా అడుగులు వేశారు. గత వారమే ఢిల్లీ వెళ్లిన జనసేనాని బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. అలాగే ఆర్ఎస్ఎస్ నేతలను కూడా కలిసినట్లు ప్రచారం జరిగింది. పవన్ తిరిగి రాష్ట్రానికి వచ్చిన రెండు రోజులకే.. పొత్తుపై క్లారిటీ ఇచ్చారు.

ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందని పవన్ అన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే రాష్ట్రానికి లాభమన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం బీజేపీతో కలిసి ముందుకెళ్తామన్నారు. జనసేన, బీజేపీ భావజాలం ఒకటిగానే ఉందని.. రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వైసీపీ, టీడీపీ వైఫల్యాలను ఎండగడతామని.. ప్రజా సమస్యలపై కలిసి పోరాడతామని పవన్ చెప్పారు. స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి పోటీ చేస్తాయన్నారు. 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల తర్వాత బీజేపీతో కాస్త కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందని పవన్ చెప్పారు.

Also Read : పవన్ ఎఫెక్ట్..? : రాజధానిలో బాలకృష్ణ పర్యటన వాయిదా

ట్రెండింగ్ వార్తలు