Ap Politics: నేడు పల్నాడు జిల్లాలో లోకేష్ పర్యటన.. అప్రమత్తమైన పోలీసులు
నేడు పల్నాడు జిల్లాలో టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇటీవల హత్యకు గురైన కంచర్ల జల్లయ్య కుటుంబసభ్యుల్ని రావులాపురం గ్రామంకు వెళ్లి పరామర్శించనున్నారు.
- Harishth Thanniru
- Published On : June 23, 2022 / 08:49 AM IST
Lokesh
Ap Politics: నేడు పల్నాడు జిల్లాలో టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇటీవల హత్యకు గురైన కంచర్ల జల్లయ్య కుటుంబసభ్యుల్ని రావులాపురం గ్రామంకు వెళ్లి పరామర్శించనున్నారు. గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి, మీదుగా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామంకు లోకేష్ చేరుకుంటారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు.
Nara Lokesh: చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు: నారా లోకేష్
లోకేష్ పర్యటనలో పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. లోకేష్ కు భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు పల్నాడు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. యరపతినేని ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే లోకేష్ టూర్ సందర్భంగా ఎలాంటి ర్యాలీలు చేపట్టకూడదని పల్నాడు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Anand Mahindra: కేటీఆర్.. మీరు అలాచేస్తే టాలీవుడ్ మిమ్మల్ని లాగేసుకుంటుంది..
పోలీసుల నోటీసుల పట్ల టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ చేపట్టి తీరతామని పల్నాడు నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఒకవేళ టీడీపీ శ్రేణులు ర్యాలీలు చేపడితే లోకేష్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ర్యాలీ చేస్తే ప్రాణనష్టం, అల్లర్లు జరుగుతాయంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడం పట్ల టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్న విషయం విధితమే.
