Anand Mahindra: కేటీఆర్.. మీరు అలాచేస్తే టాలీవుడ్ మిమ్మల్ని లాగేసుకుంటుంది..

మహింద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన ఆనంద్ మహింద్రా తనదైన శైలిలో సరదాగా రీట్వీట్ చేశారు. కేటీఆర్ మీరు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు.

Anand Mahindra: కేటీఆర్.. మీరు అలాచేస్తే టాలీవుడ్ మిమ్మల్ని లాగేసుకుంటుంది..

Ktr And And Mahindra

Updated On : June 23, 2022 / 8:24 AM IST

Anand Mahindra: మహింద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా,  మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వీరిద్దరూ నిత్యం ట్విటర్ లో యాక్టివ్ గా ఉంటారు. బుధవారం మంత్రి కేటీఆర్ జహీరాబాద్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా జహీరాబాద్ లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్ ను కేటీఆర్ సందర్శించి ట్రాక్టర్ నడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.

Gali Janardhan Reddy: నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎంను అవుతా..

ఈ సందర్భంగా మహీంద్రాజీ మీరు మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్ చేసేందుకు నేను రెడీ అంటూ మహింద్రా కంపెనీ ట్రాక్టర్ ముందు భాగంలో నిలుచొని ఫోజులిస్తున్న ఫొటోలను ట్విటర్ లో మంత్రి కేటీఆర్ పోస్టు చేశారు. కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన ఆనంద్ మహింద్రా తనదైన శైలిలో సరదాగా రీట్వీట్ చేశారు. కేటీఆర్ మీరు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది.. మీరు కెమెరా ముందుకొస్తే రాకెట్ వేగంతో దూసుకుపోతున్న టాలీవుడ్ మిమ్మల్ని తనవైపు లాగేసుకుంటుంది అంటూ ఆనంద్ మహీంద్రా చమత్కరిస్తూ ట్వీట్ చేశారు. వీరిద్దరి ఆసక్తికర సభాషణపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

Atmakur Bypoll: నేడు ఆత్మకూరు ఉపఎన్నిక.. బరిలో ఎంత మంది అంటే..

మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహింద్రా ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపుతున్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీతో పాటు తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. ఆనంద్ మహింద్రా సైతం నిత్యం ఆసక్తికరమైన విషయాలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేస్తుంటారు. కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం చేస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.