Love Couple Suicide Attempt : పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..ప్రియురాలు మృతి
ప్రకాశం జిల్లా చెంచుగూడెంలో విషాదం నెలకొంది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రియురాలు మృతి చెందగా.. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- bheemraj
- Published On : August 7, 2022 / 07:36 PM IST
Love couple suicide attempt
Love couple suicide attempt : ప్రకాశం జిల్లా చెంచుగూడెంలో విషాదం నెలకొంది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రియురాలు మృతి చెందగా.. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లలచెరువు మండలం గారపెంటచెంచుగూడెంలో గత కొంతకాలంగా పుష్పలత, వెంకటేశ్వర్లు ప్రేమించుకుంటున్నారు.
వీరి పెళ్లికి పెద్దలు అంగీకరింకచలేదు. మనస్తాపం చెంది చెంచుగూడెంలోని అడవిప్రాంతంలో ముష్టికాయల పసరు తాగిన ప్రేమ జంట అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో బంధువులు వారిని గుర్తించి…ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Love Couple Suicide : పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య
అప్పటికే ప్రియురాలు పుష్పలత మృతి చెందగా…ప్రియుడు వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారిద్దరు మైనర్లేనని చెప్తున్నారు.
