×
Ad

Madanapalle Kidney Racket : మరీ దారుణం.. పిక్నిక్ కి వెళ్దాం అని తీసుకెళ్లి కిడ్నీ కొట్టేశారు.. చంపేశారు..

Kidney Rocket : మదనపల్లె కిడ్నీ రాకెట్ ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మదనపల్లె డయాలసిస్ సెంటరులో టెక్నీషియన్‌గా

Kidney Rocket

Madanapalle Kidney Racket : మదనపల్లె కిడ్నీ రాకెట్ ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మదనపల్లె డయాలసిస్ సెంటరులో టెక్నీషియన్‌గా ఉన్న బాలరంగడు, కదిరి డయాలసిస్ టెక్నీషియనుగా ఉన్న మెహరాజ్ లను డాక్టర్ అంజినేయులు ప్రభావితం చేశారు. ఆయన సూచనలతో డయాలసిస్ సెంటర్‌కు వచ్చే డయాలసిస్ పేషంట్లలో ఆర్థికంగా బలంగా ఉన్న వారిని ఎంపిక చేసి వారికి కిడ్నీలను ఏర్పాటు చేసే బాధ్యత బాలరంగడు, మెహరాజ్ లు తీసుకున్నారు. అక్కడి నుంచి విశాఖ జిల్లా గాజువాకకు చెందిన బ్రోకర్లు పద్మ, సత్య, సూరిబాబుతో సంప్రదింపులు జరిపి వీరికి సన్నిహితురాలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒంటరి మహిళ అయిన యమునను ఎంపిక చేశారు.

తన స్నేహితులతో కలిసి పిక్నిక్‌కు వెళ్తున్నానని తల్లి సూరమ్మ, తమ్ముడు నాగేంద్రకు చెప్పి ఈనెల 6వ తేదీన యమున ఇంట్లో నుంచి వెళ్లింది. ముందస్తు ప్లాన్ లో భాగంగా.. బ్రోకర్లు పద్మ, సత్య, సూరిబాబులు యమునను నమ్మించి మదనపల్లి తీసుకొచ్చి గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ ఆపరేషన్ చేయించారు. ఆ పరేషన్ చేసే సమయంలో యమున చనిపోయింది. ఆ తరువాత మృతదేహాన్ని తిరుపతికి తరలించి, సోమవారం మృతురాలి తల్లికి సమాచారం ఇచ్చారు.

ఈ వ్యవహారం చేయిదాటి మెడకు చుట్టుకునే పరిస్థితి ఏర్పడడంతో సూరిబాబు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టి.. తిరుపతిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లి టూటౌన్ కు సమాచారం అందించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలెం గ్రామానికి చెందిన యమున (29)కు భర్త కృష్ణ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒంటరి మహిళ అయిన యమునను కిడ్నీ కోసం బ్రోకర్లు ఎంపిక చేసుకున్నారు. ఆమెకు మాయమాటలు చెప్పి పిక్నిక్ పేరుతో తీసుకెళ్లారు. గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ మార్చేశారు. అయితే, ఆపరేషన్ వికటించి ఆమె మరణించింది. అయితే, ఈ కిడ్నీ రాకెట్ సూత్రధారి అన్నమయ్య జిల్లా వైద్యశాలల సమన్వయకర్త డాక్టర్ ఆంజనేయులు అని ప్రాథమిక విచారణలో తేటతెల్లమైంది. కిడ్నీ రాకెట్ అంతా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తోందని తేలింది.

అనస్తీషియన్ గా సుదీర్ఘ అనుభవం గడించిన డాక్టర్ ఆంజనేయులుకు మదనపల్లితోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా, అనంతపురం, కడప జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులతో పరిచయాలున్నాయి. జిల్లా స్థాయి అధికారిగా ఉండడంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మదనపల్లె ఎస్బీఐ కాలనీలో నివాసాల మధ్య అనుమతి లేని ప్రదేశంలో గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించి ఏడాదిగా నిర్వహిస్తున్నారు. తన కుమారుడు అవినాష్ ఆర్థో సర్జన్, కోడలు శాశ్వతి ఆప్తాలమిక్ సర్జనుగా ఉండగా, ఆంజనేయులు చికిత్సలు అందిస్తున్నారు