జల దిగ్బంధంలో మహానంది, నీటి మునిగిన గ్రామాలు

కర్నూలు జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. మహానంది ఆలయం చుట్టూ వైపులా నీరుచేరడంతో జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయంలోని మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు చేరింది. కోనేరు వరదలతో పంచలింగాల మండపం నీతి మునిగిపోవడంతో ఆలయదర్శనాలను అధికారులు రద్దు చేశారు. 

ఆలయంతో పాటు మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి ఇబ్బందికరంగా మారింది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

కడపలోనూ అదే పరిస్థితి:
కుందూనది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగిపోయింది. పెద్ద ముడియం, రాజుపాలెం, దువ్వూరు మండలాల పరిధిలోని పలు గ్రామాలు జలదిగ్బంధానికి గురయ్యాయి. ఈ క్రమంలో ప్రొద్దుటూరు మండలం రాధానగర్‌ వద్ద కుందూనదిపై రోడ్డు దాటుతూ ఆటో వరదలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.