Kodali Nani : ఏపీ హైకోర్టులో కొడాలి నానికి భారీ ఊరట..!

Kodali Nani : ఏపీ హైకోర్టులో కొడాలి నానికి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Kodali Nani

Kodali Nani : కొడాలి నానికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గుడివాడలో నమోదైన కేసులో హైకోర్టు స్టే విధించింది. కొడాలి నానిపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ప్రాసిక్యూషన్‌‌పై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

2021 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది.

Read Also : Kieron Pollard : కీర‌న్ పొలార్డ్ భార్య.. జెన్నా ఎంత అందంగా ఉందో చూశారా? ఫోటోలు వైర‌ల్‌..

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద నానిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక ఇచ్చింది. 2021 ఫిబ్రవరి 16న ఈసీ ఆదేశాలతో కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇప్పుడు కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆయనకు భారీ ఉపశమనం దక్కినట్టు అయింది.