Man: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్ధానికులు ఒక దుర్మార్గుడికి తగిన బుధ్ధి చెప్పారు. జంగారెడ్డి గూడేనికి చెందిన అడపా వీరబ్రహ్మం అనే వ్యక్తి పాతూరు ఎనిమిదో వార్డులోని బంధువులు ఇంటికి వచ్చాడు.
వీర బ్రహ్మానికి తాగుడు అలవాటుంది. మంగళవారం మధ్యాహ్మం ఫూటుగా మద్యంతాగి బంధువుల ఇంటి సమీపంలో ఆడుకుంటున్న 3 ఏళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని గమనించిన స్ధానికులు అతడిని తాళ్లతో కట్టేసి దేహశుధ్ది చేశారు.
అంతటితో ఆగకుండా నగ్నంగా చేసి… రోడ్డుపై కొట్టుకుంటూ మున్సిపల్ కార్యాలయం వరకు ఊరేగించారు. సమాచారం తెలుసుకున్నపోలీసులు ఘటనాస్ధలానికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.