×
Ad

Kakinada Blast: కాకినాడ భారీ పేలుడు ఘటన.. చనిపోయిన వాళ్లు వీరే

సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఈ పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది.

  • Published On : February 28, 2026 / 06:45 PM IST

Kakinada Blast

 

Kakinada Blast : కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 23 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ఘటనలో మృతులను అధికారులు గుర్తించారు.

చనిపోయిన వాళ్లు వీరే..

అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్‌, గొడతా రాము, గొడతా నానితో పాటు మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఈ పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి మృతదేహాలు పంట పొలాల్లో ఎగిరిపడ్డాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. బాణసంచా తయారీ కేంద్రంలో మొత్తం 50 మంది వర్కర్లు పని చేస్తున్నట్లు సమాచారం. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. వేట్లపాలెంకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చని పొలాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.