ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా జనసేన నేత కొణిదెల నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఎమ్మెల్సీగా ఎన్నికై శాసన మండలిలో మొదటిసారి అడుగు పెట్టబోతున్న తన తమ్ముడు నాగేంద్రబాబుకి నా అభినందనలు, ఆశీస్సులు అని చిరంజీవి అన్నారు. ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నాగబాబు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.
Also Read: భారీగా లాభాలు.. బంగారంలో ఎలా పెట్టుబడులు పెట్టాలి? పూర్తి వివరాలు..
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు ఉన్నారు. ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమై దాదాపు గంటపాటు చర్చించారు.
ఇందులోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఎంపికపై చర్చ జరిగినట్లు సమాచారం. నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అంతకుముందు నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారని కూడా ఇటీవల ప్రచారం జరిగింది. మరోవైపు, రాజ్యసభ సభ్యుడిగా పంపుతారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. నాగబాబును చివరకు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎమ్మెల్సీ గా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి లో తొలి సారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబు @NagaBabuOffl కి నా అభినందనలు,ఆశీస్సులు!💐
ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని…
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 14, 2025