ఏపీ, తెలంగాణ సీఎం సహాయ నిధిలకు తలో రూ.5 కోట్లు విరాళమిచ్చిన మేఘా సంస్థ

  • Publish Date - March 27, 2020 / 10:55 AM IST

కరోనా (కొవిడ్-19) మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కరోనాపై పోరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాయి. కరోనా బాధితులకు అవసరమైన వైద్యసదుపాయాల నుంచి కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు పెద్ద ఎత్తున విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎం సహాయ నిధికి సినీ ప్రముఖుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ తమకు తోచినంత విరాళాలను అందజేస్తున్నారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కరోనా నివారణ కోసం ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లవెత్తుతున్నాయి. 

కరోనా నియంత్రణకు సీఎం సాహాయ నిధికి  మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా‌స్ట్రక్చర్ సంస్థల ఎండీ పి. వి. కృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి రూ.5 కోట్లు విరాళంగా అందించారు. తెలంగాణ సీఎం సహాయ నిధికి కూడా రూ.5 కోట్లను విరాళంగా అందజేసింది మేఘా సంస్థ.

మరోవైపు టాలీవుడ్ కు చెందిన పలువురు సినీప్రముఖులు సైతం కరోనా నివారణకు విరాళాలను ప్రకటించారు. ఒక్కొక్కరుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు లక్షల నుంచి కోట్ల రూపాయలను విరాళాలుగా అందిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు తమవంత సాయాన్ని అందిస్తూ అందరి ప్రశంసలను పొందుతున్నారు. 

Also Read | మానవత్వం ఉన్న ప్రభుత్వం మీది…మోడీపై చంద్రబాబు ప్రశంసల వర్షం