Rain Alert : బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో ఐదు రోజులు దంచికొట్టనున్న వానలు.. భీకర గాలులు
AP Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ కారణంగా ఏపీలో వచ్చే నాలుగు నుంచి ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Harish Thanniru
- Updated on- August 18, 2026 / 07:01 AM IST
AP Rain Alert
AP Rain Alert : ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర వాయవ్యంగా పయనించి జార్ఖండ్ వైపుగా వెళ్తుంది. ఈ కారణంగా రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read : Assam Government : ఉద్యోగులకు బిగ్ షాక్.. రెండో పెళ్లి చేసుకుంటే జీతం కట్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. వాయుగుండం కారణంగా నేటి నుంచి ఈనెల 23వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడే సమయంలో, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు రావొద్దుని, ఒకవేళ బయటకు వచ్చిన సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు.
మరోవైపు.. వర్షాల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని.. ఆగస్టు 19 వరకు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట, పెదబయలులో సోమవారం భారీ వాన పడింది. పాడేరు, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది. నైరుతు రుతుపవనాలు సమయానికి వచ్చినా భారీ వర్షాలు కురవలేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినా ఇప్పటి వరకు సరైన వానలు కురవలేదు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా కురిసే వర్షాలతో రైతులకు కాస్త ఊరట కలిగే అవకాశం ఉంది.
