Rain Alert : ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. భీకర గాలులు. పిడుగులు పడే చాన్స్..
AP Rain Alert : ఏపీలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
- Harish Thanniru
- Published on- July 23, 2026 / 07:00 AM IST
heavy rains in Andhra Pradesh
- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
- ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం..
AP Rain Alert : ఏపీలో వాతావరణం మారిపోయింది. గత రెండు రోజుల క్రితం వరకు వర్షాలు ముఖం చాటేయడంతోపాటు ఎండల తీవ్రత పెరిగింది. దీంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలోలేక రైతులు సాగు పనుల్లో ముందుకెళ్లలేక ఆందోళన చెందుతున్నారు. అయితే, తాజాగా ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి.
Also Read : Talliki Vandanam : తల్లికి వందనం డబ్బులు వచ్చేశాయ్.. అకౌంట్లలోకి రూ.13,000.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ (గురువారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, భీకర గాలులతోపాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు, ఈదురుగాలుల సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. నేడు (గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అదేవిధంగా పార్వతీపురం మన్యం, పోలవరం, తూర్పుగోదావరి, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చెట్ల కింద ఉండొద్దని, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
