Talliki Vandanam : తల్లికి వందనం డబ్బులు వచ్చేశాయ్.. అకౌంట్లలోకి రూ.13,000.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!
Talliki Vandanam : రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ నిధులు రూ.13,000 విడుదల చేసింది. అయితే, సాంకేతిక కారణాలతో మెసేజ్ రాకపోయినా లేదంటే నగదు జమ కాలేదనే అనుమానం ఉన్నా LEAP యాప్ ద్వారా ఈ పథకం స్టేటస్ చెక్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది.
Talliki Vandanam
Talliki Vandanam : ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం డబ్బులు జమ చేసింది. అర్హులైన వారికి రూ.13వేలు చొప్పున జమ చేసింది. ఈ పథకం కింద ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వారందరికీ 13వేలు చొప్పున నగదు జమ అవుతుంది.
2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం కింద రూ.10,120.78 కోట్ల ఆర్థిక సాయంను బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 67,47,190 మంది విద్యార్థులకు 42,70,802 మంది తల్లులు, సంరక్షకులు లబ్ధిదారులుగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 64,76,590 మంది విద్యార్థుల వివరాలు పరిశీలన పూర్తిచేసి 41,07,502 మంది తల్లుల అకౌంట్లకు ఇవాళ నిధులను ప్రభుత్వం జమ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ నిధులు రూ.13,000 విడుదల చేసింది. అయితే, సాంకేతిక కారణాలతో మెసేజ్ రాకపోయినా లేదంటే నగదు జమ కాలేదనే అనుమానం ఉన్నా LEAP యాప్ ద్వారా ఈ పథకం స్టేటస్ చెక్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది.
లీప్ యాప్‌లోకి వెళ్లి Parent Login ద్వారా తల్లికి వందనం Status ఆప్షన్‌లోకి వెళ్లి డబ్బులు జమ అయ్యాయా లేదో తెలుసుకోవచ్చని ఏపీ విద్యాశాఖ తెలిపింది. అర్హులై ఉండి డబ్బులు రాకపోతే విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని సూచించింది.
