AP Rain Alert : బలంగా ద్రోణి.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు వర్షాలు.. పిడుగులు పడే చాన్స్.. హెచ్చరికలు జారీ

AP Rain Alert : ఏపీలోని ఈ జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

AP Rains Updates

  • ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు
  • ఈదురుగాలులతోపాటు పిడుగులు పడే చాన్స్
  • హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

AP Rain Alert : ఏపీలోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతుండగా.. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా.. వర్షాలపై వాతావరణ కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వారం రోజులు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

Also Read : PV Sindhu Sports Academy : విశాఖ‌లో పీవీ సింధు స్పోర్ట్స్‌ అకాడ‌మీ.. శంకుస్థాప‌న చేసిన మంత్రి లోకేశ్.. ఫోటోలు

భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం నైరుతీ రుతుపవన ద్రోణి ఉంది. అందువల్ల సముద్రం ఉధృతంగా ఉంది. ఆగస్టు 6 నుంచి 11 వరకూ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమతో పాటు తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తర కర్ణాటక, కరైకల్ ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. సుడి గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది, ఒక్కోసారి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఆగస్టు 11 వరకూ రోజూ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని ఐఎండీ పేర్కొంది.

ఇదిలాఉంటే.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మర్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్సాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ ల వద్ద ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.