YS Jagan : డీఎస్సీపై నా ఛాలెంజ్‌కు స్పందనలేదు.. రైతులను పట్టించుకోకుండా చంద్రబాబు కుంభకర్ణుడి నిద్ర
YS Jagan : సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం డీఎస్సీపై సీబీఐ విచారణకు భయపడుతుందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
YS Jagan Criticizes Chandrababu
YS Jagan : సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం డీఎస్సీపై సీబీఐ విచారణకు భయపడుతుందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా వివరిస్తూ నేను ఛాలెంజ్ చేశానని.. డీఎస్సీపై నా ఛాలెంజ్ కు ప్రభుత్వం నుంచి స్పందన లేదని.. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా ఏదేదో మాట్లాడుతున్నారని జగన్ అన్నారు.
Also Read : SG Child Support Package : పిల్లల్ని కంటే రూ.55 లక్షలు.. ఆ ప్రభుత్వం బంపర్ ఆఫర్..
రాష్ట్రంలో కరువు తీవ్రమైన స్థాయిలో ఉంది. వర్షపాత లోటు మైనస్ 52శాతం ఉంది. రాష్ట్రంలోని 688 మండలాల్లో 625 లోటు వర్షపాతం ఉంది. 191 మండలాల్లో తీవ్రమైన వర్షపాత లోటు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన వెన్నుపోటు పార్టీ చంద్రబాబు నాయుడు మాత్రం కుంభకర్ణుడి నిద్ర నటిస్తున్నారంటూ జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. వెన్నుపోటు పార్టీ మంత్రులు పబ్లిసిటీ స్టంట్లు తప్ప నీరివ్వడం లేదని, నీరులేక నార్లు ఎండిపోతున్న పరిస్థితులు ఉన్నాయి.. రైతులకు భారీ నష్టం వాటిళ్లుతుంది.. అయిన ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వైఎస్ జగన్ ఆరోపించారు.
ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందే తెలిసినా ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవటం లేదని, కాల్వలకు నీరు వదిలినట్లు ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప నీళ్లు మాత్రం ఇవ్వలేదని కూటమి ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీమ ప్రాంతానికి నీరివ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.. శ్రీశైలం 880అడుగులు ఉన్నా పోతిరెడ్డిపాడు ద్వారా సీమ ప్రాంతానికి నీరు ఇవ్వలేదు. శ్రీశైలం నుండి తెలంగాణ, ఏపీ ఏడాపెడా కరెంటుకి నీరు వాడేస్తున్నారు. 3.5 టీఎంసీ నీళ్లు ఖాళీ చేసేస్తున్నారు. మరో మూడు వారాల్లోనే శ్రీశైలం నీటిమట్టం 854 అడుగుల దిగువకు పడిపోతుంది.. శ్రీశైలం నీళ్లు ఇలా తోడేస్తే రాయలసీమకు నీరు ఎలా ఇస్తారంటూ జగన్ ప్రశ్నించారు.
రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణ కోసం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు కీలకమని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇలాంటి పాలకులు ఉన్నందుకే ఈ ప్రాజెక్టును తీసుకొచ్చామని, అయితే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడుగడుగునా అడ్డుకున్నారని విమర్శించారు. పులిచింతల వద్ద తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా రెండు పంప్‌హౌస్‌లు నిర్మిస్తోందని జగన్ ఆరోపించారు. 10.5 టీఎంసీల నీటిని తెలంగాణ తరలించేలా ప్రాజెక్టు నిర్మిస్తుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శ్రీశైలంలో ఉన్న నీటిని ఇలా తరలిస్తే రాయలసీమకు నీరు ఎలా అందిస్తారని నిలదీశారు.
పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేయడంతో రైతులకు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందని జగన్ ఆరోపించారు. మోంతా తుఫాను నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదన్నారు. అన్నదాత సుఖీభవ కింద మూడేళ్లలో ఇవ్వాల్సిన రూ.60 వేలలో కేవలం రూ.19 వేలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందా అని ప్రశ్నించిన జగన్.. సీఎం చంద్రబాబు తాను రాష్ట్రానికి ఏం చేస్తున్నానో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
