AP Rains Today : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ
AP Rains Today : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
- Harish Thanniru
- Published on- July 9, 2026 / 06:54 AM IST
- ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్
- నైరుతి గాలుల ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
AP Rains Today : ఏపీలో కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ వర్షాలపై మరో బిగ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి గాలుల ప్రభావంతో వచ్చే ఐదు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Also Read : Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. డబ్బులు పడేది ఆరోజే.. ఇలా చేస్తేనే ఖాతాల్లోకి నగదు
గురువారం (ఇవాళ) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఏపీలో ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది. కొద్దిరోజులుగా తేలికపాటి మినహా భారీ వర్షాలు ఎక్కడా నమోదు కావడం లేదు. నైరుతి రుతుపవనాలు విస్తరించినా ఆస్థాయిలో వర్షాలు నమోదుకాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రైతులు ఖరీఫ్ పనుల సాగులో నిమగ్నమయ్యారు. భారీ వర్షాలు కురిస్తేనే భూమిలో తేమ ఏర్పడి విత్తనాలు నాటేందుకు వీలుంటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదుకాకపోవడంతో రైతులు విత్తనాలు నాటేందుకు వెనుకంజ వేస్తున్నారు. భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీపై కూడా ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలను సూచించింది. ఈ మేరకు రైతులకు కూడా అవగాహన కల్పిస్తోంది.
మరోవైపు.. ఏపీ హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో నైరుతి రుతుపవనాలు, ఎల్ నినో ప్రభావంపై సమీక్షించారు. ముఖ్యంగా ఎల్-నినో ప్రభావం ఎక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వర్షభావ పరిస్థితులపై దృష్టి సారించి, కరవు ముప్పు ఉన్న మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అదే సమయంలో, వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పునరావాస కేంద్రాలలో వసతులు కల్పించాలని మరియు పోలీస్, ఫైర్, NDRF, APSDRF బృందాలు అత్యవసర స్పందనకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
