Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. డబ్బులు పడేది ఆరోజే.. ఇలా చేస్తేనే ఖాతాల్లోకి నగదు
Thalliki Vandanam Funds Release Date 2026 : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది.
Thalliki Vandanam scheme
Thalliki Vandanam Funds Release Date 2026 : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు జమ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 16, 17, 18 తేదీల్లో మెగా పీటీఎం (పేరెంట్ టీచర్ మీటింగ్) నిర్వహించే సమయంలోనే తల్లికి వందనం డబ్బులను కూడా తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈనెలలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం నిధులు జమ కానున్నాయి.. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లుసైతం చేస్తున్నారు.
Also Read : Venu Swamy : ఎన్టీఆర్ కాబోయే సీఎం.. పవన్ కళ్యాణ్ మాత్రం.. మళ్ళీ జోస్యం చెప్పిన వేణుస్వామి..
ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఒకటి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.15 వేలు సాయం అందిస్తోంది. ఈ 15 వేల రూపాయల్లో రెండు వేల రూపాయలను పాఠశాల నిర్వహణకు మినహాయించుకుని.. మిగతా రూ.13 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. 2025 నుంచి ఈ పథకం అమలు చేస్తుండగా.. ఈ దఫా రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు.
అయితే, తల్లికివందనం పథకంకు అర్హత ఉందా..? లేదా? అనే ఆందోళన పలువురిలో నెలకొంది. ఇందుకోసం స్థానిక అధికారులను కలిసి వివరాలు చెక్ చేసుకుందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికితోడు ఈ పథకంలో మీ పేరు ఉందా లేదా అనేది ఆన్‌లైన్‌లోనూ తెలుసుకోవచ్చు.
ఆన్లైన్లో ఇలా చెక్ చేసుకోవాలి..
♦ తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ముందుగా https://bm-sgsw.ap.gov.in/BM/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
♦ అక్కడ Application Status ఐకాన్‌పై క్లిక్ చేయాలి. మరో విండో ఓపెన్ అవుతుంది.
♦ స్కీమ్ ఇయర్, ఆధార్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి.
♦ స్కీమ్ దగ్గర తల్లికి వందనంను ఎంచుకోవాలి. ఇయర్ వద్ద 2026-27ను ఎంపిక చేసుకోవాలి. సెర్చ్ బై అనే దగ్గర ఎవరి డేటాతో (తల్లి/ తండ్రి/ విద్యార్థి/ గార్డియన్) అయితే చెక్ చేయాలని అనుకుంటున్నారో వారిని సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ సెలక్ట్ చేసుకున్నవారి ఆధార్ కార్డు నంబర్‌ను పక్కన ఉన్న ఆధార్ బాక్స్‌లో ఎంటర్ చేయాలి.
♦ ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపించే క్యాప్చా, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంది.
♦ ఆ తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసి డేటాను సబ్మిట్ చేయాలి. అప్పుడు తల్లివందనం అప్లికేషన్ స్టేటస్ స్థితి తెలుస్తోంది.
