AP Rains : ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు భీకర గాలులు.. పిడుగులతో కూడిన వర్షం.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు..
AP Rains : ఏపీ విపత్తుల నివారణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మరో మూడు రోజులు వైవిధ్యమైన వాతావరణం ఉంటుందని తెలిపింది. ఒకవైపు వర్షం, మరోవైపు తీవ్రమైన గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది.
- Harish Thanniru
- Published on- June 6, 2026 / 06:37 AM IST
AP Rains
- ఏపీ ప్రజలకు APSDMA అలర్ట్
- పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు
- పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్
AP Rains : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ ఈదురుగాలులతోపాటు.. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
Also Read : Pawan Kalyan : ‘ఉచిత పథకం’ రాజకీయాలకు యువత ఎందుకు దూరమవుతోంది? పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్
ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కేరళ రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. తమిళనాడులోకి నైరుతి ఎంట్రీ అయింది. దీంతో ఆ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండుమూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెల 15 నాటికి రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీ విపత్తుల నివారణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మరో మూడు రోజులు వైవిధ్యమైన వాతావరణం ఉంటుందని తెలిపింది. ఒకవైపు వర్షం, మరోవైపు తీవ్రమైన గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. శనివారం పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి కొత్తూరు, హిరమండలంతోపాటు తదితర ప్రాంతాలలో గంటకు 60 కిలోమీటర్లకు మించిన వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మెరుపులు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
మరోవైపు.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
