Ap Heavy Rains: బంగాళాఖాతంలో మరో తీవ్ర వాయుగుండం.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన.. తీర ప్రాంతాలకు హై అలర్ట్

బంగాళాఖాతంలో మరొక వాయుగుండం(Ap Heavy Rains) ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Meteorological Department issued warning predicting heavy rainfall for Ap

Ap Heavy Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలను వర్షాలు వీడటం లేదు. ఇటీవలే తీవ్ర వాయుగుండం కళింగపట్నం వద్ద తీరం దాటి ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచెత్తిన సంగతి మరవకముందే, బంగాళాఖాతంలో మరొక వాయుగుండం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం మయన్మార్ – అండమాన్ పరిసర ప్రాంతాల మధ్య కేంద్రీకృతమైన ఈ వాయుగుండం, రాగల 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అండమాన్‌లోని మాయాబందర్‌కు తూర్పు ఈశాన్యంగా 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయవ్య దిశగా బంగ్లాదేశ్ వైపు ప్రయాణిస్తున్న ఈ తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు(Ap Heavy Rains) కురిసే అవకాశముంది.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దసరా నాటికి ఫేజ్-1 స్వాధీనం.. డెడ్‌లైన్ ఫిక్స్

72 గంటల్లో తీరం దాటే అవకాశం – గంటకు 40 కి.మీ వేగంతో గాలులు:

ఈ తీవ్ర వాయుగుండం రాబోయే 72 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్ తీరాల నడుమ తీరం దాటవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కోస్తాంధ్రలోని తీర ప్రాంత జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున రైతులు, తీరప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.