AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడ్రోజులు వానలు.. ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే చాన్స్..
AP Rain Alert : ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వచ్చే మూడు రోజులు కూడా ఏపీలోని ఆయా జిల్లాల్లో వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
- Harishth Thanniru
- Published On : March 19, 2026 / 07:18 AM IST
AP Rains
- ఏపీలో మూడు రోజులు వర్షాలు
- పలు ప్రాంతాల్లో పిడుగులు పడే చాన్స్
- ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి
AP Rain Alert : ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతుండగా.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వచ్చే మూడు రోజులు కూడా ఏపీలోని ఆయా జిల్లాల్లో వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని, అక్కడక్కడా పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Also Read : Revanth Reddy Roja : తెలంగాణ CM రేవంత్ రెడ్డిని కలిసిన వైసీపీ నాయకురాలు రోజా
ఏపీలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. ఈదురుగాలుతో కూడిన వానలతోపాటు.. ఆకస్మిక వర్షాలతో పడే పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ముఖ్యంగా వర్షం పడే సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిదని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ స్తంభాల వద్ద, చెట్ల కింద, హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు.
ఇదిలా ఉంటే.. ఏపీలోని మార్కాపురంలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అలానే కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల మండలంలోని పలు ప్రాంతాలలో వడగండ్ల వాన పడగా.. ఉంగుటూరు, ఘంటసాల, కంకిపాడులో ఈదురుగాలులతో మోస్తరు వర్షం పడింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయం ఉంది. కోత దశలో ఉన్న మిరప, మినుము, పెసర తదితర పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంట నీటిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
