Ap Heavy Rain Alert: ఏపీకి అల్పపీడన ముప్పు.. గంటకు 60 కి.మీ వేగంతో గాలులు.. ఆదివారం భారీ వర్షాలు.. పలు జిల్లాలకు బిగ్ అలర్ట్
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Ap Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
- V Santhosh Kumar
- Published on- September 12, 2026 / 06:38 PM IST
Andhra Pradesh Heavy Rain Warning Disaster Management Guidelines
- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు
- తీరం వెంబడి ఈదురు గాలులు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Ap Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో ఈ అల్పపీడనం విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉండటంతో, ఆదివారం ఉత్తరాంధ్రతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు(Ap Heavy Rain Alert) కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవా డిసెంబర్ కోటా టికెట్లు విడుదల
ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్.. గంటకు 60 కి.మీ వేగంతో గాలులు:
మన్యం, పోలవరం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే వీలుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
రికార్డు స్థాయి వర్షపాతం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అత్యధికంగా 108 మి.మీ, ఇరగవరంలో 107 మి.మీ, పెనుమంట్రలో 104.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే కంచిలి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వర్షం కురిసింది. ఉప్పొంగి ప్రవహించే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని, పాత చెట్లు, హోర్డింగుల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు ప్రజలను కోరారు.
