పార్టీ నడపలేక చేతులెత్తేశారు : పవన్ గుంపుగా వచ్చినా జగన్ ను ఏమీ చెయ్యలేరు

బీజేపీ-జనసేన పొత్తు తర్వాత ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ, వామపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు.

  • Publish Date - January 17, 2020 / 10:06 AM IST

బీజేపీ-జనసేన పొత్తు తర్వాత ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ, వామపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు.

బీజేపీ-జనసేన పొత్తు తర్వాత ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ, వామపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ వైఖరిని తప్పుపడుతూ విమర్శలు చేస్తున్నారు. పవన్ తో దోస్తీ అంటూ కుక్క తోక పట్టుకుని గోదారి ఈదటమే అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఇప్పుడు మంత్రి అనిల్ కుమార్ రియాక్ట్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన 6 నెలలకే పార్టీ నడపలేక పవన్ చేతులెత్తేశారని మంత్రి అనిల్ అన్నారు.

పవన్ ను జనం నమ్మరు:

వామపక్ష భావజాలం పేరుతో జనసేన పెట్టిన పవన్.. అందుకు భిన్నంగా వేరే వారితో చేతులు కలిపారని మంత్రి అనిల్ సీరియస్ అయ్యారు. ఉన్న ఒక్క సీటును కూడా నిలుపుకోలేని పవన్ ను జనం నమ్మరు అని చెప్పారు. ఎన్నికలకు ముందే టీడీపీకి పవన్ దత్తపుత్రుడిగా మారారని విమర్శించారు. పవన్ గుంపుగా వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చెయ్యలేరు అని మంత్రి అనిల్ అన్నారు. 

మోడీ ఫ్రెష్ లడ్డూ ఇచ్చారా..?

ప్రత్యేక హోదా విషయంలో పాచిపోయిన లడ్డూ అని ప్రధాని మోడీపై ధ్వజమెత్తిన పవన్ కు.. ఇవాళ జీడిపప్పు, కిస్ మిస్ తో మోడీ ఫ్రెష్ లడ్టూలు పంపారా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశానని చెప్పుకునే పవన్.. హోదా అడక్కుండా బీజేపీతో బేషరతుగా ఎందుకు కలసి పనిచేస్తానని హామీ ఇచ్చారో చెప్పాలన్నారు. గతంలో ఎన్నో కూటములు పెట్టారు… అయినా వైసీపీకే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. చంద్రబాబు సీఎం అయినా, ప్రతిపక్షంలో ఉన్నా మీకు జగనే టార్గెట్ అన్నారు. సుజనా, సీఎం రమేష్ లాంటి వాళ్ళని చంద్రబాబు బీజేపీలోకి పంపారు.. ఇప్పుడు మీరు బీజేపీతో కలిశారు.. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వైసీపీ నేతలు మండిపడ్డారు.

2024లో అధికారం మాదే:

బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని… వారి ఆశల మేరకే తమ పొత్తు ఏర్పడిందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఎలాంటి షరతులు లేకుండా ఇరు పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించాయన్నారు. 2024లో అధికారం మాదే అని బీజేపీ-జనసేన నేతలు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి పనిచేస్తామని పవన్, కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

Also Read : జగన్ పై నిందలు వేస్తే ఊరుకోను : పవన్ కు కేఏ పాల్ వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు