Botsa Satyanarayana : ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా? మంత్రి బొత్స
రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు కారణం కాదా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
- bheemraj
- Published On : August 19, 2023 / 05:40 PM IST
Botsa Satyanarayana (1)
Botsa Satyanarayana – Chandrababu – Pawan Kalyan : చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్ పై(Pawan Kalyan)మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలోనే రైతు ఆత్మహత్యలు జరిగాయని ఆరోపించారు. ఏపీలో(AP) చంద్రబాబుకు సొంత ఇల్లు ఉందా అని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు జనాలను పీడించారని.. అందుకే ప్రజలు టీడీపీ(TDP)ని తరిమి కొట్టారని వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది ఎవరు అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు కారణం కాదా అని అన్నారు. పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Minister KTR : హిందు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ పని : మంత్రి కేటీఆర్
రుషికొండ ప్రైవేట్ ఆస్తి కాదు, మీకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. రుషికొండలో ప్రభుత్వ భవనాలు కడుతున్నామని చెప్పామని తెలిపారు. పర్యావరణ అనుమతుల మేరకే భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఎలా అని నిలదీశారు.
సీఎం జగన్ ప్రజా పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి సీఎం పని చేస్తున్నారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నదే తమ విధానం అన్నారు.
