Minister KTR : హిందు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ పని : మంత్రి కేటీఆర్

తెలంగాణ ఆత్మగౌరవం, ఢిల్లీ గులాంగురికి మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరు, వీళ్లకు ఓటు ఎలా వేస్తారు అని ప్రశ్నించారు.

Minister KTR : హిందు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ పని : మంత్రి కేటీఆర్

Minister KTR (1) (1)

KTR Criticized Congress And BJP : కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. హిందు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ పని అని విమర్శించారు. కేసీఆర్ (CM KCR) పథకాలు కొనసాగిస్తామని బీజేపీ నేతలు అంటున్నారని చెప్పారు. ‘కేసీఆర్ పథకాలు కొనసాగించాకా మీరెందుకు’ అని ప్రశ్నించారు. సంచులు మోసి జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పీసీసీ అంటే ప్రైమ్ మినిస్టర్ పదవి అయినట్లు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ లో చేరికలు ఊపందుకున్నాయి. శనివారం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో పలువురు నేతలు పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఢిల్లీ నేతల మాటలు వింటే మాటిమాటికీ ఢిల్లీ వెళ్లాలని తెలిపారు.

High Tension in Jangaon : జనగాం కారు పార్టీలో కుమ్ములాట..టికెట్ కోసం సై అంటై సై అంటున్న నేతలు

తెలంగాణ ఆత్మగౌరవం, ఢిల్లీ గులాంగురికి మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరు, వీళ్లకు ఓటు ఎలా వేస్తారు అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నాయని తెలిపారు. సంపద పెంచాలి, పేదలకు పంచాలనేదే తమ నినాదం అన్నారు. ‘కల్వకుర్తి ప్రజలు తెలివిగల వారు.. మీతో పెట్టుకున్నోడు ఎవడు బాగు పడలేదు’ అని అన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు ఉండాలని పేర్కొన్నారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విద్యా వైద్య రంగాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని తెలిపారు. ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. 11 సార్లు ఛాన్స్ ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు.

‘మీ నియోజకవర్గ అభివృద్దికి మాది బాధ్యత. పార్టీ టికెట్ ఎవరికి వచ్చిన వారికి మద్దతుగా నిలవాలి.. గెలిపించుకోవాలి. మహబూబ్ నగర్ లో 14 స్థానాలు బీఆర్ఎస్ గెలవాలి. వుప్పల వెంకటేష్ కచ్చితంగా పెద్ద పదవి ఇస్తాం. వెంకటేష్ ను గత వారమే కలిశాను. తన రాజకీయ జీవితం ఏంటని అడిగా. 18 ఏళ్లకే సర్పంచ్ అయ్యానని చెప్పాడు. పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నడు. కచ్చితంగా బీఆర్ఎస్ అండ మీకు ఉంటుంది.
తలకొండపల్లి కి వస్తాను, మీ సత్తా చూస్తాన’ని కేటీఆర్ అన్నారు.