Nadendla Manohar: ఏపీలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే పైప్ నేచురల్ గ్యాస్
ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు వచ్చినందున దాదాపు 2వేల 800 కిలో లీటర్ల కిరోసిన్ సప్లయ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాం.
- Naveen
- Published On : March 21, 2026 / 01:01 AM IST
Nadendla Manohar: ఏపీలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై కీలక ప్రకటన చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదన్న ఆయన.. గ్యాస్ కొరతపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. డొమెస్టిక్ సిలిండర్ల దుర్వినియోగాన్ని నివారించాలని మంత్రి తేల్చి చెప్పారు. OTP విధానంలోనే డెలివరీ జరుగుతుందని స్పష్టం చేశారు. అనవసరంగా గ్యాస్ ఏజెన్సీల దగ్గర గుమికూడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారాయన.
ముఖ్యంగా ఖతార్ లో జరిగిన ఘటనల కారణంగా ఆయిల్, గ్యాస్ సరఫరాలపై ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. అర్బన్ ప్రాంతాల్లో పైప్ నేచురల్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఎక్కడైనా సిలిండర్ల డైవర్షన్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 9మందిపై చర్యలు తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు.
”ప్రజలు లేనిపోని భయాలు పెట్టుకోవద్దు. అపోహలతో వంట గ్యాస్ కోసం బుకింగ్స్ వద్దు. పానిక్ బుకింగ్స్ కారణంగా సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెటింగ్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి నాదెండ్ల వార్నింగ్ ఇచ్చారు.
”ఈ కొరత ఒక రోజు కోసం కాదు, ఒక వారం కోసం కాదు. ఖతార్ లో గ్యాస్ క్షేత్రంపై జరిగిన దాడిని చూస్తే రాబోయే రోజుల్లో ఆయిల్, గ్యాస్, సీఎన్ జీ విషయంలో కచ్చితంగా ప్రజలు కొంత త్యాగం అనేది సిద్ధం అవ్వాలి. మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. కిరోసిన్ కూడా సప్లయ్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కిరోసిన్ ఫ్రీ స్టేట్ గా మనం రాష్ట్రాన్ని 12ఏళ్ల క్రితమే డిక్లేర్ చేసుకున్నాం. కానీ ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు వచ్చినందున ముందుగా గిరిజన ప్రాంతాల్లో, అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 2వేల 800 కిలో లీటర్ల కిరోసిన్ సప్లయ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాం” అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అర్బన్ ప్రాంతాల్లో పైప్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లా జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లయ్ అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే 54 వేల ఇండక్షన్ స్టవ్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధనాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అనవసర అపోహల కారణంగా
