Nara Lokesh
Help Line Numbers: జీవనోపాధి కోసం కొందరు పుట్టిన ఊరుని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. అక్కడైతే మంచి ఉద్యోగాలు దొరుకుతాయని, జీతం ఎక్కువగా వస్తుందని, తమ కష్టాలు తీరతాయని అనుకుంటారు. కానీ, అక్కడికి వెళ్లాకే తెలుస్తోంది అసలు విషయం. వారు పడే ఇబ్బందులు, అవస్థలు అన్నీఇన్నీ కావు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు ఎందరో. అక్కడ ఉండలేరు, స్వదేశానికి తిరిగి రాలేరు. వారు పడే బాధ అంతా ఇంతా కాదు. తమను ఆదుకోవాలని అధికారులను వేడుకునే వారు ఎందరో. ఈ క్రమంలో విదేశాల్లో ఇబ్బందుల్లో ఉండే తెలుగువారికి అండగా నిలిచారు మంత్రి నారా లోకేశ్. అలాంటి వ్యక్తుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు.
థాయిలాండ్‌లో కొందరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకులు మోసపోయారని తనకు తెలిసిందని మంత్రి లోకేశ్ చెప్పారు. ఐటీ, డిజిటల్ ఉద్యోగాల పేరుతో అక్కడికి వెళ్లిన యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోయారని తెలిసిందన్నారు. అలా మోసపోయిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇక, ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే.. +91-863-2340678.. వాట్సాప్ నెంబర్ 85000 27678. విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారు ఈ నెంబర్లను సంప్రదించాలని మంత్రి లోకేశ్ చెప్పారు.
” ఆంధ్రప్రదేశ్ యువత జాగ్రత్త.. ఐటీ/డిజిటల్ ఉద్యోగాల కోసం థాయిలాండ్ వెళ్లిన కొంతమంది యువకులు ఏజెంట్ల కారణంగా మోసపోయారని తెలిసింది. వారు దోపిడీని ఎదుర్కొంటున్నారని నా దృష్టికి వచ్చింది. మేము వారితో టచ్ లో ఉన్నాము. వారు భారతదేశానికి సురక్షితంగా తిరిగి రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అటువంటి సంఘటనలను నివారించడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ నెంబర్ ద్వారా ఉద్యోగ ఆఫర్లను ధృవీకరించుకోండి. అత్యవసర పరిస్థితులను నివేదించండి.
+91-863-2340678
WhatsApp: 8500027678
విదేశాలలో ఇబ్బందుల్లో ఉన్నారా? OMCAP/NRTని సంప్రదించడానికి వెనుకాడకండి. మీ భద్రతే మా ప్రాధాన్యత” అని తన సోషల్ మీడియా ఖాతాలో వివరాలు తెలిపారు నారా లోకేశ్.